నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న రోహింగ్యాలు.. కేసులు నమోదు..

భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాల గురించి తెలిసిందే. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలు మన తెలంగాణలో స్థిరపడ్డారు. ఎక్కువగా హైదరాబాద్‌లో నివాసాలు ఏర్పరచుకోగా.. కొందరు నల్గొండ జిల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో కొందరు రోహింగ్యాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 17 మంది రోహింగ్యాలతో పాటుగా.. వారికి సహకరించిన వారిపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ కింద […]

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న రోహింగ్యాలు.. కేసులు నమోదు..
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 2:09 PM

భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాల గురించి తెలిసిందే. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలు మన తెలంగాణలో స్థిరపడ్డారు. ఎక్కువగా హైదరాబాద్‌లో నివాసాలు ఏర్పరచుకోగా.. కొందరు నల్గొండ జిల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో కొందరు రోహింగ్యాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 17 మంది రోహింగ్యాలతో పాటుగా.. వారికి సహకరించిన వారిపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

జిల్లాలో పట్టుబడ్డ రోహింగ్యాలలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఎనిమిది మంది హైదరాబాద్‌లోని బాలాపూర్‌ క్యాంపుకు చెందిన వారు కాగా.. ఏడుగురు మేవాట్.. ఇద్దరు జమ్మూకశ్మీర్‌ క్యాంపుకు చెందిన వారిగా గుర్తించారు. కాగా.. ఇప్పటికే అనేక మంది రోహింగ్యాల జాడ తెలియడం లేదని తెలుస్తోంది. వీరిలో కొందరు ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్‌కు కూడా హాజరైనట్లు సమాచారం.