జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులను వేయడం గత కొద్ది రోజుల నుంచి తీవ్ర దుమారంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉండటంతో దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. దీంతో సీఎం జగన్ మూడు వారాల్లోపు అన్ని..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 2:38 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులను వేయడం గత కొద్ది రోజుల నుంచి తీవ్ర దుమారంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉండటంతో దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. దీంతో సీఎం జగన్ మూడు వారాల్లోపు అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించారు. కాగా ఇప్పుడు ఇదే విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

‘పరాకాష్టకు చేరింది వైసీపీ రంగుల రాజకీయం. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం అక్రమం అంటూ బీజేపీ ఎన్నోసార్లు హెచ్చరించినా సుమారు రూ. 1400 కోట్లు దుర్వినియోగం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు రంగులు మార్చడానికి ఎంత వృథా చేయనున్నారో? ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు కన్నా లక్ష్మీ నారాయణ.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా

భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లో దివ్య దర్శనం