Credit Score: మీకు తెలియకుండానే మీ సిబిల్ స్కోర్ పడిపోతుందా.. ఈ తప్పులు చేస్తే లోన్ కష్టమే..
మీ ఈఎంఐలు కరెక్ట్‌గానే కడుతున్నా క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా..? అయితే మీరు క్రెడిట్ కార్డుల వాడకంలోనో, లేదా పదే పదే లోన్ల కోసం ఎంక్వైరీలు చేయడంలోనో తెలియకుండానే తప్పులు చేస్తున్నారు. ఒక్క రోజు బిల్లు ఆలస్యమైనా, క్రెడిట్ లిమిట్ దాటి వాడినా మీ సిబిల్ స్కోర్ ఎలా దారుణంగా పడిపోతుందో, మీ స్కోర్‌ను మళ్లీ సేఫ్ జోన్‌కు ఎలా తెచ్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. సే ఆ ప్రధాన కారణాలేంటో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.

సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, లేదా అత్యవసరాల కోసం పర్సనల్ లోన్ కావాలన్నా.. ఈ రోజుల్లో బ్యాంకులు అడుగుతున్న మొదటి ప్రశ్న..మీ క్రెడిట్ స్కోర్ ఎంత?. మన ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పట్టే ఈ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. ఒకవేళ ఇది తక్కువగా ఉంటే మాత్రం లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం ఖాయం. అయితే చాలామంది తాము లోన్ ఈఎంఐలు కరెక్ట్‌గానే కడుతున్నామని అనుకుంటారు.. కానీ తమకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో క్రెడిట్ స్కోర్ ఘోరంగా పడిపోతుంటుంది. అసలు మనకు తెలియకుండా క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుందో, దానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ కార్డ్ బిల్లు.. ఒక్క రోజు ఆలస్యమైనా దెబ్బే
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జేబులోనూ క్రెడిట్ కార్డులు సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఈ కార్డుల బిల్లు చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యం జరిగినా మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు, గడువు తేదీలను మర్చిపోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటారు. నెలాఖరున బిల్లులో కేవలం మినిమం డ్యూ కట్టి వదిలేసినా కూడా క్రెడిట్ స్కోర్ క్రమంగా తగ్గుతూ వస్తుంది.
క్రెడిట్ లిమిట్ మొత్తం వాడేస్తున్నారా?
బ్యాంకులు ఒక వ్యక్తి యొక్క ఆదాయం, ఖర్చులను లెక్కించి ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక నిర్దిష్ట పరిమితిని ఇస్తాయి. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ రూ.1 లక్ష అనుకుందాం. మీరు ప్రతి నెలా ఆ లక్ష రూపాయలను పూర్తిగా వాడేస్తుంటే.. మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఎందుకంటే లిమిట్ మొత్తం వాడేవారిని బ్యాంకులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఎప్పుడైనా సరే మీ మొత్తం లిమిట్‌లో కేవలం 30 శాతం లోపు మాత్రమే వాడటం అలవాటు చేసుకోవాలి.
పదే పదే లోన్ల కోసం ఎంక్వైరీలు చేయడం
మీకు అర్జంట్‌గా లోన్ కావాల్సి వచ్చినప్పుడు.. ఒకేసారి నాలుగైదు బ్యాంకులకు వెళ్లి అప్లై చేయడం లేదా ఆన్‌లైన్ యాప్స్‌లో పదే పదే మీ సిబిల్ స్కోర్ చెక్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేసిన ప్రతిసారీ బ్యాంకులు మీ సిబిల్ హిస్టరీని హార్డ్ ఎంక్వైరీ చేస్తాయి. ఇలా తక్కువ వ్యవధిలో ఎక్కువ ఎంక్వైరీలు జరిగితే, మీకు తెలియకుండానే సిబిల్ స్కోర్ పాయింట్లు టకటకా తగ్గిపోతాయి.
పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం
చాలామంది ఒక క్రెడిట్ కార్డ్ వాడటం మానేసినప్పుడు దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తుంటారు. కానీ అది చాలా పాత కార్డ్ అయితే.. దాన్ని క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ అకౌంట్ ఎంత పాతదైతే, మీ క్రెడిట్ స్కోర్ అంత బలంగా ఉంటుంది. కాబట్టి పాత కార్డులపై ఎలాంటి యాన్యువల్ ఛార్జీలు లేకపోతే వాటిని అలాగే ఉంచడం మంచిది.
ఇతరుల లోన్లకు ష్యూరిటీగా ఉంటున్నారా
మీ స్నేహితులకో, బంధువులకో లోన్ కావాలన్నప్పుడు మీరు గ్యారెంటర్‌గా సంతకం పెడుతుంటారు. ఒకవేళ వారు ఆ లోన్ ఈఎంఐలను సమయానికి కట్టకపోతే.. ఆ ఎఫెక్ట్ నేరుగా మీ క్రెడిట్ స్కోర్‌పై పడుతుంది. వారు చేసే డిఫాల్ట్ వల్ల మీ సిబిల్ స్కోర్ కూడా ఘోరంగా పడిపోతుంది.
బిల్ స్కోర్ పెరగడానికి చిన్న స్మార్ట్ టిప్
మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటేనే దాన్ని బెస్ట్ స్కోర్‌గా బ్యాంకులు భావిస్తాయి. మీ బిల్లులను ఎప్పుడూ ఆటో డెబిట్ మోడ్‌లో పెట్టుకోవడం వల్ల బిల్లులు ఆలస్యం అయ్యే ప్రమాదం తప్పుతుంది.
