AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Buses: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆర్టీసీలో ప్రయాణం మరింత సౌకర్యవంతం

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో గుడ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ కింద ఏపీకి కొత్తగా 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనితో రాష్ట్రంలో ప్రయాణికులు రద్దీలేని ప్రయాణాన్ని సాగించవచ్చు.

Electric Buses: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆర్టీసీలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
Andhra Pradesh Gets 750 Electric Buses
M Sivakumar
| Edited By: |

Updated on: May 30, 2026 | 3:28 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఆర్టీసీ సేవలను మరింత ఆధునికంగా మార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ అంశంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నట్టు తెలిపారు. వీటిలో 12 మీటర్ల పొడవు, 35+1 సీటింగ్ సామర్థ్యం కలిగిన 621 బస్సులు ఉండగా.. 9 మీటర్ల పొడవు, 25+1 సీటింగ్ సామర్థ్యం గల 129 బస్సులు ఉండనున్నాయి.

ఈ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్‌లో చేరడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా సామర్థ్యం, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన నగరాల్లో అవసరమైన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో ఈ-బస్సుల కోసం ప్రత్యేకంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరుకు సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం రూ.27.49 కోట్లు, మంగళగిరికి రూ.16.25 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. 2026 చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ బస్సులుదోహదపడనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ ఆధునీకరణలో ఇది కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?
దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?
ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత
ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత
కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు
కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు
వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?
వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?
టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం
టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం
కావేరి కాలింగ్ ఉద్యమం ద్వారా మెరుగైన ఫలితాలు
కావేరి కాలింగ్ ఉద్యమం ద్వారా మెరుగైన ఫలితాలు
హైదరాబాద్‌ నుంచి 36 మందితో బయల్దేరిన బస్సు.. సరిగ్గా అక్కడికి
హైదరాబాద్‌ నుంచి 36 మందితో బయల్దేరిన బస్సు.. సరిగ్గా అక్కడికి
ఇవి దశాబ్దాల పాటు ఆహారం లేకుండా కూడా జీవించగలవు
ఇవి దశాబ్దాల పాటు ఆహారం లేకుండా కూడా జీవించగలవు
మేతకు వెళుతున్న గేదెలు మాయం..ఏంటా అని గోదావరి ఒడ్డను కాపుకాసి
మేతకు వెళుతున్న గేదెలు మాయం..ఏంటా అని గోదావరి ఒడ్డను కాపుకాసి