‘జెర్సీ’ కోసం విక్టరీ

'జెర్సీ' కోసం విక్టరీ

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో చాలా కష్టపడి చేస్తున్న సినిమా ‘జెర్సీ’. ఈ సినిమా కోసం క్రికెట్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు నాని. ట్రైలర్ రీలీజ్ తర్వాత సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది.  క్రికెట్ నేపధ్యం కలిగి ఉండటంతో పాటు…కెరీర్‌లో ఫెయిల్యూర్ అయిన ఓ యువకుడు తండ్రిగా మారిన తరువాత ఎలా  తిరిగి సక్సెస్ అయ్యాడు అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫెయిల్యూర్ స్టోరీస్‌కు […]

Ram Naramaneni

|

Apr 13, 2019 | 5:27 PM

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో చాలా కష్టపడి చేస్తున్న సినిమా ‘జెర్సీ’. ఈ సినిమా కోసం క్రికెట్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు నాని. ట్రైలర్ రీలీజ్ తర్వాత సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది.  క్రికెట్ నేపధ్యం కలిగి ఉండటంతో పాటు…కెరీర్‌లో ఫెయిల్యూర్ అయిన ఓ యువకుడు తండ్రిగా మారిన తరువాత ఎలా  తిరిగి సక్సెస్ అయ్యాడు అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫెయిల్యూర్ స్టోరీస్‌కు మంచి డిమాండ్ ఉండటంతో.. ఇలాంటి కథలతోనే సినిమాలు వస్తున్నాయి. జెర్సీ సినిమా ఏప్రిల్ 19 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని డైరెక్డ్ చేశారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 15 వ తేదీన శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ రానున్నారు. రీసెంట్ గా రిలీజైన మజిలీ సినిమాకు కూడా వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా రావడంతో ఆ సినిమా మంచి విజయం సాధించింది.  ఈ సెంటిమెంట్ తోనే జెర్సీ సినిమాకు కూడా వెంకటేష్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తుంది. నానికి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి నాని కెరీర్‌కు ‘జెర్సీ’ ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu