‘నారప్ప’ను పూర్తిచేసిన వెంకటేష్.. ‘F3’ షూటింగ్లో పాల్గోంటునే మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..
టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'నారప్ప'. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Venkatesh Narappa Movie Update: టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ప్రియమణి హీరోయిన్గా నటిస్తుంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్’ రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైందని వెంకటేశ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
“నారప్పతో నా ప్రయాణం నేటితో పూర్తయింది. ఈ సినిమా విడుదల కోసం వేచి చూడండి” అంటూ షేర్ చేశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అనంతరం వెంకటేష్ F3 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నన్నాడు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ మరో సినిమాకు కూడా ఓకే చేప్పినట్లుగా తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో కలిసి సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీ కూడా సురేష్ బాబు ప్రొడక్షన్లోనే రానున్నట్లు తెలుస్తోంది.
Wrapped up shoot for #Narappa today and I have to say the feeling is overwhelming. Cant wait for the release and for you all to watch it!??#Priyamani #SrikanthAddala@Sureshprodns @theVcreations
— Venkatesh Daggubati (@VenkyMama) February 1, 2021
Also Read:
మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఆ వార్తల్లో ఎలాంటి క్లారటీ లేదంటున్న మోనాల్..