ఆ సినిమా కోసం ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్న స్టార్ హీరో.. మూవీ రిలీజ్ వరకు అంతేనంటా.. ఎవరో తెలుసా ?
ప్రస్తుతం కాలంలో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా ఫోన్‌ను విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయాం.
Ameer Khan Lal Singh Chadda Movie Update: ప్రస్తుతం కాలంలో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా ఫోన్‌ను విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయాం. ఎదైనా అర్జెంట్ పని ఉన్నా.. లేదా ఎవరితోనైనా మాట్లాడాలి అనుకున్నా.. ఆఖరికి ఖాళీగా ఉండి టైంపాస్ చేయాలన్నా ఫోన్ ఉండాల్సిందే. ఒకవేళ ఆకస్మాత్తుగా మన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందంటే.. ఇక ఈ ప్రపంచంలో మన ఆచూకీ మాయమైపోయినట్లుగా భావిస్తుంటాం. ఇక సెలబ్రెటీలు కూడా ఎప్పుడూ కూడా ఆన్లైన్లో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కానీ ఓ స్టార్ హీరో మాత్రం తన ఫోనును స్విచ్ఛాప్ చేసి పక్కన పెట్టాడంట.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాల విషయంలో ఎంత కచ్చితంగా ఉంటాడో మరోసారి రుజువు చేశాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ఏకంగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడట. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ వేరువేరుగా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట అమీర్. అంతేకాదండోయ్.. తన సోషల్ మీడియా అకౌంట్లను కూడా అతడి టీం చూసుకుంటారట. ఏదైనా అర్జెంట్ పని ఉంటే తన మేనేజర్‌కు కాల్ చేయాలని తన ఫ్యామిలీకి సూచించాడట అమీర్. ఇదంతా లాల్ సింగ్ చద్దా సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకు ఫాలో చేయనున్నాడట అమీర్.
Also Read:
‘నారప్ప’ను పూర్తిచేసిన వెంకటేష్.. ‘F3’ షూటింగ్లో పాల్గోంటునే మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..