Adipurush Movie: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్‌కు తప్పిన పెను ముప్పు..
Adipurush Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' మూవీ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని..
Adipurush Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ మూవీ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని గోరెగావ్ ఫిల్మ్ స్టూడియో ఈ సినిమా మొదటి రోజు షూట్ జరుపుకుంటుండగా… షార్ట్ సర్య్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తి కాలిపోవడంతో పాటు సుమారు రూ. 125 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని బీ-టౌన్ వర్గాలు వెల్లడించాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. డైరెక్టర్ ఓం రౌత్ బృందమంతా సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈరోజు షూట్‌లో హీరో ప్రభాస్, విలన్ సైఫ్ ఆలీఖాన్ పాల్గొనలేదని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందగా.. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!
#WATCH I Maharashtra: Firefighting operation underway at the studio in Goregaon, Mumbai where a fire broke out earlier today. No injuries reported so far. pic.twitter.com/z8jDAV8IRu
— ANI (@ANI) February 2, 2021