సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..
'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో
‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో నటించిన.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత హీరోయిన్గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ సూపర్ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.
పౌరాణిక ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నా సంగతి తెలిసింది. మహాభారతంలోని ఆదిపర్వంలోగల దుష్యంతుడు, శాకుంతలం ప్రేమ కథ నేపథ్యంలో ఈ మూవీ రానుంది. అయితే ఇందులో శకుంతల పాత్రలో హీరోయిన్ సమంత నటించనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక దుష్యంతుడి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తెలుగమ్మాయి ఈషారెబ్బా నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొందర్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read: