మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బిగ్‏బాస్ బ్యూటీ.. ఆ వార్తల్లో ఎలాంటి క్లారిటీ లేదంటున్న మోనాల్..

తెలుగులో దాదాపు ఐదు సినిమాల్లో హీరోయిన్‏గా నటించిన రాని గుర్తింపు ఒక్క రియాల్టీ షోతో సొంతం చేసుకుంది గుజరాతీ భామ మోనాల్. తెలుగు రాకుండానే బిగ్‏బాస్‏లోకి

  • Rajitha Chanti
  • Publish Date - 6:34 pm, Tue, 2 February 21
మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బిగ్‏బాస్ బ్యూటీ.. ఆ వార్తల్లో ఎలాంటి క్లారిటీ లేదంటున్న మోనాల్..

తెలుగులో దాదాపు ఐదు సినిమాల్లో హీరోయిన్‏గా నటించిన రాని గుర్తింపు ఒక్క రియాల్టీ షోతో సొంతం చేసుకుంది గుజరాతీ భామ మోనాల్. తెలుగు రాకుండానే బిగ్‏బాస్‏లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు దాదాపు 14 వారాల పాటు కొనసాగింది. ఆ షో తర్వాత మోనాల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు హీరోయిన్‏గా మాత్రమే ఉన్న మోనాల్.. స్టార్ మాలోని డ్యాన్స్ ప్లస్ షోకి ఏకంగా జడ్జిగా మారిపోయింది.

ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలోని స్పెషల్ సాంగ్‏లో మెరిసింది మోనాల్. తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలోని స్పెషల్ సాంగ్‏లో మోనాల్ నటించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మోనాల్, మహేష్ సినిమాలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా మోనాల్ స్పంధించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో తాను ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయడం లేదని స్ఫష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల స్టార్ మా చేపట్టిన బిగ్‏బాస్ రీయూనియన్ పార్టీలో మోనాల్ పాల్గోంది.

Also Read:

బొమ్మ పడితే నటిస్తా.. బొరుసు పడితే నటించను.. కాయిన్ ఎగురవేసి నిర్ణయాన్ని చెప్పిన హీరోయిన్.. ఎవరంటే ?

Pagal Movie Update: విశ్వక్ సేన్ ‘పాగల్’ ఫస్ట్‏లుక్ రిలీజ్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..