Uppal Balu: కుటుంబం కోసమే అన్నీ.. ఉప్పల్ బాలు నెల సంపాదన మరీ అంత తక్కువా.. ?
ఉప్పల్ బాలు తన నెలవారీ సంపాదన లక్షల్లో కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వస్త్రధారణ, రీల్స్ కేవలం కుటుంబ బాధ్యతల కోసమేనని, ముఖ్యంగా తల్లి కోసం కష్టపడుతున్నానని తెలిపారు. ఇంటర్వ్యూలు, ప్రమోషన్ల ద్వారా వచ్చే ఆదాయంతో సంతృప్తిగా ఉన్నానని, పేరు కోసం ఉప్పల్ బాలుగా మారానని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో తన వీడియోలతో, మాట తీరుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఉప్పల్ బాలు. ఇటీవల అగ్ని పరీక్ష షోలో పాల్గొని ఎలిమినేట్ అనంతరం సంచలన విషయాలు చెబుతూ నెట్టింట మరింత పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నిజమైన ఆదాయం, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. బ్రాండ్ అంబాసిడర్గా భారీగా సంపాదిస్తున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ, తాను నెలకు 60 వేల నుంచి 70 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నానని స్పష్టం చేశారు. అధిక ఆదాయంపై వస్తున్న పుకార్లను బాలు ఖండించారు. లక్షలు, కోట్లు తనకు రావని, ఒక ఇంటర్వ్యూకు 2000 నుండి 3000 రూపాయలు, ఒక ప్రమోషన్కు 5000 నుండి 10000 రూపాయలు మాత్రమే లభిస్తాయని వెల్లడించారు. తన మేడం సహాయంతో ఈ పనులు చక్కబెట్టుకుంటానని తెలిపారు. తన వస్త్రధారణ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వెనుక కుటుంబ బాధ్యతలే ప్రధాన కారణమని బాలు అన్నాడు. ముఖ్యంగా తన తల్లికి తాను చాలా ప్రాణమని, ఆమె కోసమే ఈ వేషధారణ, ఈ ప్రచారం అంతా అని భావోద్వేగంగా చెప్పారు. లైక్స్ పొందడం, దాని ద్వారా డబ్బు సంపాదించడం అంతా తన కుటుంబ సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
ప్రస్తుతం తాను సంపాదిస్తున్న 60-70 వేల రూపాయలు తనకు సరిపోతాయని, జీవితంలో డబ్బు శాశ్వతం కాదని బాలు తత్వజ్ఞానాన్ని పంచుకున్నారు. “బతకడానికి మనకు ఉన్న పది రూపాయలు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే చచ్చిపోతే మనం ఏం తీసుకుపోలేము. పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోలేము. పుట్టినప్పుడు మనం ఏం తీసుకురాము. పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము. ఇది ఒకటి గుర్తిస్తే చాలు. వచ్చినోళ్ళలో బతకొచ్చు” అని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, సొంత ఇల్లు లేదని కూడా బాలు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
ఉప్పల్ బాలు అనే పేరు గురించి మాట్లాడుతూ, తాను ఉప్పల్లో నివసిస్తున్నందున ఆ పేరు పెట్టుకున్నానని చెప్పారు. అంతేకాకుండా, ఈ పేరు ప్రఖ్యాతి చెందాలని కోరుకునే ఆశతోనే ఈ పేరును ఎంచుకున్నట్లు వివరించారు. బోనాల పండుగలకు వెళ్లడం గురించి అడగ్గా, తాను బోనాలకు వెళ్తానని, గతంలో వెళ్లానని, తాను కూడా బోనం ఎత్తుకున్నానని తెలిపారు. అయితే, కొన్నిసార్లు వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోవచ్చని చెప్పారు. “మనకి మంచిగా ఉంటే వెళ్తామండి. ప్రతిసారి వెళ్తూ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి గొడవలు ఇలాంటివి అయినా అవుతుంటాయి కదా లైఫ్లో. నాకు మంచిగా ఉంటే బాడీ కొన్ని షోలకి వెళ్తా. కొంచెం బాలేకుండా, ఫ్యామిలీ విషయంలో ఏదో వర్క్ ఉన్నా, ఇంటికాడ వెళ్ళాలి, మమ్మీకి బాలేదు, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏదో పనులు ఉన్నాయంటే కొన్ని నేను మానుకుంటా అంతే” అని బాలు స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..
