AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2 Box Office : జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. రజినీకాంత్ తొలి రోజు కలెక్షన్స్ రికార్డులు బద్దలు..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన మోస్ట్ అటిసిపేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, రజినీ గత చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తూ తొలి రోజే భారీ వసూళ్లు సాధించేలా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంతకీ నివేదికల ప్రకారం ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..

Jailer 2 Box Office : జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. రజినీకాంత్ తొలి రోజు కలెక్షన్స్ రికార్డులు బద్దలు..
Jailer 2 Movie
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2026 | 8:16 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సంచలన విజయం సాధించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన లేటేస్ట్ మూవీ ‘జైలర్ 2’ (Jailer 2). ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న ఈ చిత్రం అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించిన అంచనాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రజినీకాంత్ నటనతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమా ఆ రికార్డును అధిగమించింది. మొదటి భాగం ఇచ్చిన హైప్ కారణంగా, సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

మొదటి భాగంలో టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ చూపించిన మాస్ యాక్షన్ , అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు ‘జైలర్ 2’ చిత్రంలో మరింత పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, హై-వోల్టేజ్ డ్రామా ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో పాటు, ప్రీ-సేల్స్ ద్వారా సరికొత్త సంచలనాలు సృష్టించడానికి ఈ చిత్రం సిద్ధమవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

నివేదికల ప్రకారం ఈ సినిమా తొలిరోజే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని సినీ పరిశ్రమ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించనున్నారు.ఈ వసూళ్లపై క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ చేసిన ప్రకటనలోనే ఉంది. రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ని కూడా సన్ పిక్చర్స్ నిర్మించిందన్నది గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us