AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించి కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ నెల 31 వరకే ఛాన్స్.. మిస్సయితే నష్టమే..

ఈపీఎఫ్ఓ మరో కీలక డెసిషన్ తీసుకుంది. ఇప్పటివరకు అర్హత ఉండి పీఎఫ్ పరిధిలో చేరని ఉద్యోగులకు అవకాశం కల్పించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు పీఎఫ్ పరిధిలో చేరనివారు ఇప్పుడు జాయిన్ కావొచ్చు. ఈ మేరకు యజమాన్యాలకు పీఎఫ్ సంస్థ సూచనలు చేసింది.

Venkatrao Lella
|

Updated on: Oct 16, 2026 | 7:55 AM

Share
ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరింతమంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు అందించేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా ఇటీవల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కొత్తగా 51 లక్షల మందికి పీఎఫ్ బెనిఫిట్స్ అందనుండగా.. ఈ క్రమంలో పీఎఫ్ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.

1 / 5
గతంలో కొన్ని సాంకేతిక కారణాలు, ఇబ్బందుల వల్ల పీఎఫ్ పరిధిలో చేరని ఉద్యోగులను ఇప్పుడు చేర్చాలని యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ సూచించింది. ఈ మేరకు అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. యజమానులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026 కింద ఈ కార్యక్రమం చేపడుతోంది.

2 / 5
గతంలో వివిధ కారణాలతో నమోదు కాని ఉద్యోగులను నమోదు చేయించాలని కంపెనీలకు భవిష్య నిధి సంస్థ ఆదేశించింది. గతంలో పాటించిన నిబంధనలను క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుందని, ఈ అవకాశాన్ని కంపెనీలు కోల్పోవద్దని స్పష్టం చేసింది. వెంటనే యాజమాన్యాలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

3 / 5
2009 నుంచి 2026 మధ్య పీఎఫ్ అకౌంట్ లేని ఉద్యోగులను గుర్తించి వారిని చేర్చేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ మేరకు యాజమాన్యాలు తమ పాత రికార్డులను పరిశీలించి అర్హత ఉన్న ఉద్యోగులను చేర్చాలని సూచించింది. ఏప్రిల్ 1, 2009 నుంచి మార్చి 31,2026 మధ్య వివిధ టెక్నికల్ కారణాలతో చేరని ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

4 / 5
ఈ ప్రయోజనం పొందాలంటే ఇప్పటికీ ఉద్యోగి అదే కంపెనీలో పనిచేస్తూ ఉండాలి. తమకు అర్హత ఉన్నా పీఎఫ్ అకౌంట్ ఇవ్వలేదని అనుకునే ఉద్యోగులు దీనికి అర్హులు అవుతారు. అలాంటి ఉద్యోగులు తమ యజమాన్యాన్ని సంప్రదించాలి. కొత్తగా ఈ కార్యక్రమం ద్వారా చేరినవారికి ఉద్యోగుల వాటా పూర్తిగా రద్దు చేయనున్నారు. యజమాని తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us