OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో 7.6 రేటింగ్
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడి ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 7.6 రేటింగ్ దక్కడం విశేషం.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (అక్టోబర్ 16) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఓటీటీలంటేనే మలయాళం సినిమాలదే హవా. అందుకు తగ్గట్లే ప్రతివారం నాలుగైదు మలయాళం సినిమాలు తెలుగులోకి అనువాదమై స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఈ వారం కూడా పలు మలయాళం సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదొకసైకలాజికల్ డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్. తెలుగు వారికి బాగా పరిచయమైన మలయాళం నటి ఊర్వశి ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే తెలుగు వారికి బాగా తెలిసిన జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించాడు. ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక చిన్న నర్సరీ నడుపుకునే ఆశా (ఊర్వశి) గతంలో జరిగిన ఒక చేదు సంఘటన వల్ల మానసికంగా కుంగిపోయి ఉంటుంది. తన కూతురు (అనఘ) జీవితంగా బతుకుతుంటుంది. అయితే ఒకరోజు ఈ తల్లీ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు జీమన్ (జోజు జార్జ్) అనే వ్యక్తి వాహనాన్ని ఢీకొడుతుంది. అనుకోకుండా జరిగిన ఈ చిన్న యాక్సిడెంట్ గొడవ చివరకు చినికి చినికి గాలి వానగా మారుతుంది. గొడవలు వద్దని చెప్పినా మొండి పట్టుదలతో ఉన్న ఆశా పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. చివరకు ఏమైందన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్.
థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చి ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా పేరు ‘ఆశా’. సఫర్ సనాల్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఊర్వశి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయ్ రాఘవన్, జాయ్ మాథ్యూ, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్స్, డార్క్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడేవారు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడం, తమిళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 7.6 రేటింగ్ దక్కడం విశేషం.
జీ 5లో స్ట్రీమింగ్..
#Aasha (Malayalam)
Now streaming on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada, Hindi 🍿!!
#OTT_Trackers https://t.co/Jfd8r7yqma
— OTT Trackers (@OTT_Trackers) October 15, 2026
ఆశా సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




