AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుకో బ్యాంకులో 530 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఉద్యోగావకాశం!

యుకో బ్యాంక్‌ 2026–27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 530 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 8 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన 20–28 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16,650 స్టైపెండ్‌ చెల్లిస్తారు..

యుకో బ్యాంకులో 530 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఉద్యోగావకాశం!
UCO Bank Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 16, 2026 | 7:37 AM

Share

బ్యాంకింగ్‌ రంగంలో శిక్షణతో పాటు ఉద్యోగ అనుభవం పొందాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్‌ (UCO Bank) గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 8 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 29, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపికను ఆన్‌లైన్‌ పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞాన పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా చేపట్టనున్నారు. యుకో బ్యాంక్‌ దేశవ్యాప్తంగా మొత్తం 530 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యమైన రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 8
  • తెలంగాణలో పోస్టుల సంఖ్య: 8
  • తమిళనాడులో పోస్టుల సంఖ్య: 21
  • కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 11
  • కేరళలో పోస్టుల సంఖ్య: 10
  • ఉత్తరప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 45
  • పశ్చిమ బెంగాల్‌లో పోస్టుల సంఖ్య: 86
  • బిహార్‌లో పోస్టుల సంఖ్య: 34

యుకో బ్యాంకులో అప్రెంటీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై తగిన పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2026 అక్టోబరు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (NATS) పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత యుకో బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని అప్రెంటిస్‌ నియామక విభాగం ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, స్థానిక భాష వివరాలను సరిగ్గా నమోదు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ (PwBD) అభ్యర్థులు – రూ.200 + జీఎస్‌టీ, జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్థులు – రూ.800 + జీఎస్‌టీ, జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ మహిళా అభ్యర్థులు – రూ.600 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.16,650 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇది అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించిన నియామకం. కాబట్టి దీనిని సాధారణ శాశ్వత బ్యాంకు ఉద్యోగ నియామకంగా భావించకూడదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో 3 దశలు ఉంటాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞాన పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష విధానం

ఆన్‌లైన్‌ పరీక్ష మొత్తం 100 మార్కులకు, 60 నిమిషాల వ్యవధిలో నిర్వహించనున్నట్లు ఇచ్చిన వివరాల్లో పేర్కొన్నారు., జనరల్‌ / ఫైనాన్స్‌ అవేర్‌నెస్‌ – 25 మార్కులు, ఇంగ్లిష్‌ / హిందీ భాష – 25 మార్కులు, రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ – 25 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ – 25 మార్కులు చొప్పున ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబరు 14, 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29, 2026
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబరు 29, 2026
  • ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: నవంబరు 7, 2026

యుకో బ్యాంకులో అప్రెంటీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us