AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు.. లైవ్ వీడియో

Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2026 | 8:21 AM

Share

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అర్ధరాత్రి నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 4 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వీడియోను చూడండి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక 6వ రోజు సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీ దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడానికి విద్యార్థులు, భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి చేతిలో వీణ, పుస్తకం, జపమాలతో శ్వేతవస్త్రధారిణిగా దర్శనమిస్తారు. ఇక మూలానక్షత్రం సందర్భంగా అర్థరాత్రి నుంచే దర్శనాలు ప్రారంభం అయ్యాయి. సరస్వతీ దేవి జన్మ నక్షత్రం మూలానక్షత్రం కావడంతో ఈరోజు చేసే అక్షరాభ్యాసాలు, పూజలు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇందుకు 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు కలెక్టర్‌ లక్ష్మీషా. 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చినా.. ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. గరిష్ఠంగా రెండు గంటల్లో దర్శనం పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు.

నేడు ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు రాక..

నేడు ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు రానున్నారు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు పట్టువస్త్రాలను సిఎం చంద్రబాబు సమర్పించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కొండ మీదకు రానున్నారు. నేడు అన్నీ క్యూ లైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తున్నారు.

Published on: Oct 16, 2026 08:01 AM
Follow Us