AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను నమ్మించి మదనపల్లి లాడ్జ్‌కి తీసుకొచ్చాడు.. రాత్రి వరకు కలిసే ఉన్నారు.. తెల్లవారుజామున బాత్రూంలో..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని రాజ్‌భవన్ లాడ్జిలో రుబియా సుల్తానా అనే వివాహిత హత్యకు గురైంది. కర్ణాటక నుంచి భార్యను తీసుకుచ్చిన భర్త.. లాడ్జ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపిన ఆమె భర్త నవీద్ భాషా స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను నమ్మించి మదనపల్లి లాడ్జ్‌కి తీసుకొచ్చాడు.. రాత్రి వరకు కలిసే ఉన్నారు.. తెల్లవారుజామున బాత్రూంలో..
Madanapalle Lodge Case
Raju M P R
| Edited By: |

Updated on: Oct 16, 2026 | 7:40 AM

Share

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వివాహిత దారుణహత్యకు గురైంది. మదనపల్లి వన్‌టౌన్ పీఎస్ పరిధిలో ఉన్న రాజభవన్ లాడ్జ్‌లోని బాత్రూంలో డెడ్ బాడీగా కనిపించింది. కర్ణాటకలోని ముల్బాగల్‌కు సమీపంలోని కురుప్పేటకు చెందిన రుబియా సుల్తానాను.. ఆమె భర్త నవీద్ భాషా లాడ్జ్‌లో చంపి.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడంతో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ముల్బాగల్ ప్రాంతానికి చెందిన నవీద్ భాషా, రుబియా సుల్తానా.. ఇద్దరికీ పక్కపక్క గ్రామాలే. 10వ తరగతి చదివే సమయం నుంచి ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. అనంతరం దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కట్ చేస్తే ఏపని స్థిరంగా చేయని నవీద్ భాషా వ్యవహారం కుటుంబంలో చిన్నపాటి గొడవలకు కారణం అయింది. ఏడాదిన్నర క్రితం ముల్బాగల్ పోలీస్ స్టేషన్‌లో భర్త నవీద్ భాషాపై భార్య రుబియా సుల్తానా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవీద్ భాషాపై వరకట్న వేధింపులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు అయింది.

సంపాదన లేకపోవడం, ఏ పని చేయని నవీద్ భాషా తీరుతో కుటుంబంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. పెద్దలు పంచాయతీ కూడా చేశారు. ఇద్దరి మధ్య రాజీ చేసి కాపురం చేసుకునేలా చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బు కోసం నవీద్ భాషా గంజా బిజినెస్ ప్రారంభించాడు. గంజా ప్యాకెట్లను తయారు చేసి విక్రయించేందుకు భార్య రుబియా సుల్తానా సహకారం కోరాడు. అయితే, ఇందుకు భార్య అంగీకరించలేదు.. దీంతో మళ్లీ దాడి చేయడంతో మరోసారి రుబియా సుల్తానా పోలీసులను ఆశ్రయించింది.

ఈ మేరకు నెలన్నర క్రితం నవీద్ భాషాపై అటెంప్ట్ మర్డర్, గంజా కేసు నమోదు కాగా జైలుకు వారం క్రితం వచ్చిన నవీద్ భాషా భార్యను నమ్మించే ప్రయత్నం చేశాడు. ముల్బాగల్‌లో కేసులు ఉండడంతో బతుకుతెరువు కోసం మదనపల్లికి షిఫ్ట్ అయ్యేలా భార్య రుబియా సుల్తానాను ఒప్పించాడు. రామసముద్రంలో బంధువుల ఇంటికి వెళదామని చెప్పి మదనపల్లికి వచ్చిన నవీద్ భాషా పక్క ప్లాన్ అమలు చేశాడు.

మదనపల్లిలో కాపురం పెడదామని..

మదనపల్లి వన్ టౌన్ పిఎస్ పరిధిలో రాజ్ భవన్ లాడ్జిలో గదిని తీసుకొని మదనపల్లిలో కాపురం ఉండేందుకు వీలుగా ఇల్లు వెతుకుదామని నమ్మించాడు. ఇందుకు ఓకే చెప్పిన భార్య రుబియా సుల్తానా భర్తతో సంతోషంగానే గడిపింది. మదనపల్లి రాజ్‌భవన్ లాడ్జిలో స్టే చేసిన సుల్తానా, నవీన్ భాషా లు హ్యాపీ మూడ్‌లోనే ఉన్నట్లు సిబ్బంది కూడా గుర్తించారు. రాత్రి డిన్నర్ కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చిన ఇద్దరినీ గమనించిన లాడ్జి సిబ్బందికి ఎలాంటి అనుమానం రాకపోయింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రూబియా బేగం వాష్‌రూమ్‌కు వెళ్ళింది.

ఆ సమయంలో ఖాళీ బీర్ బాటిల్‌తో భార్య పై నవీద్ భాషా దాడి చేశాడు. వెనుక నుంచి తలపై బలంగా కొట్టడంతో రుబియా సుల్తానా బాత్రూంలోనే కింద పడిపోయింది. ఆపై బీర్ బాటిల్ గాజు ముక్కతో గొంతు కోయడంతో ప్రాణాలు వదిలింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నవీద్ భాషా లాడ్జిలో నుంచి బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి లాడ్జ్ గేటు తాళాలు తీయించి బయటకు వెళ్ళిపోయాడు.

అనంతరం, నేరుగా ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను హత మార్చినట్లు చెప్పి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. చేసిన నేరాన్ని అంగీకరించడంతో నవీద్ భాషా ను అదుపులో తీసుకున్న పోలీసులు లాడ్జ్ కు చేరుకున్నారు. గదిలో వాష్ రూమ్ లో పడి ఉన్న డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. నవీద్ భాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us