AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali Twitter Review: ‘రణబాలి’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్-రష్మికల సినిమా టాక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'రణబాలి'. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవాళే (అక్టోబర్ 15) ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా చూసిన ఆడియెన్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం రండి.

Ranabaali Twitter Review: 'రణబాలి' ట్విట్టర్ రివ్యూ.. విజయ్-రష్మికల సినిమా టాక్ ఎలా ఉందంటే?
Ranabaali Twitter Review
Basha Shek
|

Updated on: Oct 16, 2026 | 7:14 AM

Share

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మొదటి సినిమా రణబాలి. బ్రిటీష్ పాలన సమయంలో రాయలసీమను వెంటాడిన కరువు, ప్రజల కష్టాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రణబాలి సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ట్రైలర్, పాటలతో ఆసక్తి క్రియేట్ చేసిన రణబాలి.. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా శుక్రవారం (అక్టోబర్ 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో రణబాలి సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

రణబాలి సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. తనకు ఈ సినిమా బాగా నచ్చిందని తెలిపాడు. ఈ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా అభివర్ణించారు. విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందని, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా కాలం గుర్తుండిపోతుందని ప్రశంసలు కురిపించాడు. ఇక రష్మిక మందన్న కూడా తన పాత్రలో మెప్పించిందని పేర్కొన్నాడు. ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా, వివరంగా తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మరో హిట్ కొట్టారన్నాడు. ముఖ్యంగా అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రణబాలి సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

రణబాలి సినిమా ట్విట్టర్ రివ్యూ..

ఇక మరో యూజర్ ‘రణబాలి’ సినిమా గురించి ఇలా రాసుకొచ్చాడు. ‘రణబాలి ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.సెకండాఫ్ కూడా సూపర్బ్ గాఉంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాల బిల్డప్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయి. ఇంటర్వెల్ సీన్‌లో విజయ్ దేవరకొండ తన నటనతో అదరగొట్టాడు. ఆయన ఇంటెన్సిటీ అద్భుతంగా ఉంది. కొన్ని సీన్లలో విజయ్ ను చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ చాలా అందంగా ఉంది. ఇద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో సహజంగా, ఆకర్షణీయంగా ఉంది’ అని రివ్యూ ఇచ్చాడు. మొత్తానికి రణబాలి సినిమాకు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వారందరూ బ్లాక్ బస్టర్ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us