Bigg Boss 10 Telugu : ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్ జోన్లోకి ఆ ఇద్దరు కంటెస్టెంట్లు.. ఎలిమినేట్ అయ్యేదేవరంటే..
బిగ్ బాస్ 10 తెలుగు ఆరో వారం ఎలిమినేషన్లో భాగంగా ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకవైపు సోషల్ మీడియాలో పూర్తిగా నెగిటివిటీ మూటగట్టుకుంది షాలిని. ఆమెను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అంటూ తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ ఈసారి ఆమె కాకుండా మరో కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రసవత్తరంగా మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో ఐదు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో నామినేషన్స్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. మాటల దాడి కాకుండా కొట్టుకున్నంత పనిచేశారు కంటెస్టెంట్స్. సెలెబ్రిటీలు వర్సెస్ కామనర్స్గా సాగుతున్న ఈ పోరులో ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరనే టెన్షన్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ వారం ఎమినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వచ్చారు. ఇందులో అగ్ని పరీక్ష టీం నుంచి రోహిత్, అమన్, షాలినీ ఉండగా.. సెలెబ్రిటీల టీం నుంచి రాంప్రసాద్, టెంపర్ వంశీ , యాంకర్ వర్షిణి నామినేట్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్లో పలువురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఈ ఆరో వారంలో సెలెబ్రిటీ టీం నుంచి ఒకరిపై వేటు పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే, రోహిత్ తనకంటూ బలమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకోవడంతో పాటు విన్నర్ రేసులో దూసుకెళ్తున్నాడు. అగ్ని పరీక్ష టీం నుంచి నామినేట్ అయిన రోహిత్ చాలా బలంగా ఉన్నాడు. ఆయనకు పడుతున్న ఓట్లు చూస్తుంటే ప్రేక్షకులు అతన్ని విన్నర్ మెటీరియల్‌గా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ షాలిని ఎలిమినేట్ అయితే మాత్రం రోహిత్ టాప్ లో దూసుకెళ్లడం ఖాయమని అంటున్నారు నెటిజన్స్. ఇక వివాదాలు, గొడవలతో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న షాలినీ , అమన్‌లను కూడా ఇప్పట్లో బయటికి పంపే అవకాశం లేదనే అంచనాలున్నాయి. రాంప్రసాద్ కూడా తనదైన శైలిలో గేమ్‌ను కొనసాగిస్తున్నారు. షాలిని పరంగా నెగిటివిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ… షోకి టీఆర్పీ పరంగా వీరే రన్ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
దీంతో ఈ వారం ఓటింగ్‌లో టెంపర్ వంశీ , వర్షిణి పేర్లు డేంజర్ జోన్లో వినిపిస్తున్నాయి. గతంలోనూ వీరు ముగ్గురు, నలుగురు డేంజర్ జోన్లోకి వచ్చినప్పటికీ, పవర్ యూజ్ చేయడం వల్ల సేఫ్ అవుతూ వచ్చారు. అయితే ఈ వారం మాత్రం ఓటింగ్‌లో వీరు ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరి జర్నీ ముగుస్తుందో వేచి చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..
