Trivikram Srinivas: సూపర్ స్టార్ మహేష్ కోసం అదిరిపోయే స్టోరీని సిద్ధం చేస్తున్న మాటల మాంత్రికుడు..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న
Trivikram Srinivas: సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కు ఇటీవలే చిన్న బ్రేక్ పడింది. చిత్రయూనిట్ లో కొందరు కరోనా బారిన పడటం తో ఈ సినిమా షూటింగ్ ను కొద్దీ రోజుల పాటు నిలిపివేశారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు మహేష్ ,.తో చేసే సినిమా ఎన్టీఆర్ కథనే అంటూ ప్రచారం జరుగుతుంది. రాజకీయాలకు సంబంధించిన కథ కావడం వల్లనే ఈ సినిమాకి ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను సెట్ చేశారు. అయితే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయనున్నట్టు తెలుస్తుంది. దాంతో ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథతోనే గురూజీ మహేష్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. మహేశ్ తో జూన్ లో సెట్స్ పైకి వెళ్లి .. అక్టోబర్ నాటికి షూటింగు పూర్తిచేయాలనే ప్లానింగ్ తో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఈ కథ కూడా రాజకీయాల నేపథ్యంలోనే నడుస్తుందనీ, సంజయ్ దత్ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో వాస్తవమెంతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :
ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా.