‘ఆస్కార్’ సెలక్షన్స్‌‌లో ఇండియన్ ఫిల్మ్ స్టార్స్

ఆస్కార్ ఆ పేరు వింటేనే సినిమాకు పనిచేసే నటులు, టెక్నీషియన్స్ తన్మయత్వానికి లోనవుతారు. ప్రపంచంలోనే సినిమావారికి అరుదైన, గొప్పదైన గౌరవ సూచకంగా ఆస్కార్ అవార్డును భావిస్తారు. అసలు ఆస్కార్‌లో నామినేట్ అయితే చాలు జన్మ ధన్యం అనుకునేవారు లేకపోలేదు. అలాంది ఆ ఆస్కార్ అవార్డుకు అర్హులను ఎంపిక చేసే భాధ్యత లభిస్తే..ఇంక చెప్పేది ఏముంటుంది?.. కాగా అవార్డుల ఎంపిక కమిటీ కొత్త సభ్యులుగా వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖుల్ని ఆహ్వానించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ […]

'ఆస్కార్' సెలక్షన్స్‌‌లో ఇండియన్ ఫిల్మ్ స్టార్స్
Follow us

|

Updated on: Jul 03, 2019 | 4:54 PM

ఆస్కార్ ఆ పేరు వింటేనే సినిమాకు పనిచేసే నటులు, టెక్నీషియన్స్ తన్మయత్వానికి లోనవుతారు. ప్రపంచంలోనే సినిమావారికి అరుదైన, గొప్పదైన గౌరవ సూచకంగా ఆస్కార్ అవార్డును భావిస్తారు. అసలు ఆస్కార్‌లో నామినేట్ అయితే చాలు జన్మ ధన్యం అనుకునేవారు లేకపోలేదు. అలాంది ఆ ఆస్కార్ అవార్డుకు అర్హులను ఎంపిక చేసే భాధ్యత లభిస్తే..ఇంక చెప్పేది ఏముంటుంది?.. కాగా అవార్డుల ఎంపిక కమిటీ కొత్త సభ్యులుగా వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖుల్ని ఆహ్వానించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.

ఇండియా నుంచి దర్శకులు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్​తో పాటు నటుడు అనుపమ్ ఖేర్​ ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 842 మంది కొత్త వారికి ఈ అవకాశం దక్కింది. ఇందులో సగానికి పైగా మహిళలున్నారు. వీరితో పాటే 21 మంది గతంలో  ఆస్కార్ విజేతలు, 82 మంది ఆస్కార్​ నామినేషన్​ పొందిన వారు ఈ జాబితాలో ఉండటం విశేషం. వీరితో పాటే దర్శక-రచయిత రితేశ్ బత్రా, దర్శకుడు నిషా గనత్రా, భారత మూలాలున్న బ్రిటీష్ నటి ఆర్చి పంజాబీ, విజువల్ ఎఫెక్ట్స్​ విభాగంలో షెర్రీ భద్ర, శ్రీనివాస్ మోహన్.. ఆస్కార్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2018 లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యకమానికి 928 మందిని ఆహ్వానించింది. అప్పుడు భారత్ నుంచి షారుఖ్ , మాధురీ దీక్షిత్, నషిరుద్దీన్ షా వంటి ప్రముఖులు ఉన్నారు.