ఆ నటికి పెళ్లి కాకుండానే..

కొంతమంది సమాజాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. వారికి కట్టుబాట్లన్నీ చట్టుబండల్లా అనిపిస్తాయి. ఈ కోవలోకి వచ్చే వారిలో సినీ నటులు చాలమంది ముందు వరసలో ఉంటారు. మహీగిల్ గుర్తుందా? సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్స్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకున్న నటి. దేవ్ డీ, దబాంగ్ సిరీస్, జంజీర్ మూవీస్‌లో కూడా ఆమె నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ అందాల సుందరి తాజాగా మరోసారి వార్తలకెక్కింది. నవభారత్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఇంతకు ముందెన్నడూ వెల్లడించని వ్యక్తిగత […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:51 pm, Wed, 3 July 19
ఆ నటికి పెళ్లి కాకుండానే..

కొంతమంది సమాజాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. వారికి కట్టుబాట్లన్నీ చట్టుబండల్లా అనిపిస్తాయి. ఈ కోవలోకి వచ్చే వారిలో సినీ నటులు చాలమంది ముందు వరసలో ఉంటారు. మహీగిల్ గుర్తుందా? సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్స్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకున్న నటి. దేవ్ డీ, దబాంగ్ సిరీస్, జంజీర్ మూవీస్‌లో కూడా ఆమె నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ అందాల సుందరి తాజాగా మరోసారి వార్తలకెక్కింది.

నవభారత్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఇంతకు ముందెన్నడూ వెల్లడించని వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. తనకింకా పెళ్లికాలేదని చెబుతూనే అయినప్పటికీ మూడేళ్ల పాప ఉందంటూ షాక్ ఇచ్చింది. తన పాప పేరు వెరోనికా అని కూడా చెప్పింది. తను ఒక తల్లిగా ఎంతో గర్విస్తున్నానని, తనకు అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని మనసులో మాటను చెప్పుకొచ్చింది మహీ.

వివాహం కాకుండానే పిల్లలా అనే ప్రశ్నకు సమాధానంగా పిల్లల్ని కనాలంటే పెళ్లి అవసరం లేదు కదా అంటూ బదులిచ్చింది. వివాహం చేసుకోకుండానే కుటుంబాన్ని, పిల్లల్ని కూడా పొందవచ్చు .. పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి.. కానీ చేసుకోవాలా వద్దా అనేది మాత్రం వ్యక్తిగతం అని చెప్పుకొచ్చింది. ఇకపోతే వచ్చే ఈ ఆగస్టుతో తన పాపకు మూడేళ్లు వస్తాయని సంతోషంగా చెప్పింది మహీ గిల్.