Sharwanand: ఆ స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సినిమా చేయనున్న యంగ్ హీరో శర్వానంద్..
యంగ్ హీరో శర్వానంద్ కరోనా కల్లోలం తర్వాత జోరు పెంచాడు. వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్లలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ కరోనా కల్లోలం తర్వాత జోరు పెంచాడు. వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్లలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో మాహసముద్రం అనే సినిమా చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమా మరో హీరోగా బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంటెన్స్ లవ్ స్టోరీ కం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలోకి వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడితో ‘ఒకే ఒక జీవితం’ సినిమాను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం మాత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ,మరో సినిమాను ఓకే చేశాడు శర్వా. శర్వానంద్ హీరోగా రాజు సుందరం డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతుందని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంఫర్మ్ అయిందని తెలుస్తుంది. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే అందించినట్టుగా చెబుతున్నారు. కథ వినగానే శర్వానంద్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. ‘ఏగన్’ అనే సినిమాతో దర్శకుడి అవతారమెత్తిన రాజుసుందరం.. ఇప్పుడు శర్వా కోసం మరోసారి మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :