Tarun – Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న హీరో తరుణ్.. మొదలైన విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంచెం సేపటి క్రితం టాలీవుడ్ నటుడు తరుణ్ హైదరాబాద్ లోని ఈడి కార్యాలయానికి చేరుకున్నారు.

Tarun - Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న హీరో తరుణ్.. మొదలైన విచారణ
Drugs Case Tarun
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 22, 2021 | 12:37 PM

Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంచెం సేపటి క్రితం టాలీవుడ్ నటుడు తరుణ్ హైదరాబాద్ లోని ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నేప‌థ్యంలో హీరో తరుణ్ ఈడీ కార్యాల‌యంలో అధికారుల ముందు విచార‌ణ‌కు హాజరయ్యారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్‌ను ఈడీ ప్రశ్నించనుందని సమాచారం. 2017 లో ఎక్సైజ్ శాఖ విచారణ సైతం ఎదుర్కొన్నాడు తరుణ్.

2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో శాంపుల్స్ కూడా తరుణ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తరుణ్ ఇచ్చిన బయో శాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ చార్జ్ షీట్ లో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. తాజాగా మరోసారి కెల్విన్ ఇచ్చిన వివరాలపై తరుణ్ ను విచారించనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఎఫ్ లాంజ్ క్లబ్ కు కెల్విన్ తో ఉన్న సంబంధాలపైనా ఈడీ ఆరా తీసే అవకాశం ఉంది.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించారు. డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేపట్టిన విచారణ చివరిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్పటికే అధికారులు టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ, న‌వ‌దీప్‌ను విచారించిన విష‌యం తెలిసిందే. రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు కూపీ లాగుతున్నారు.

Read also: Hyderabad: హైదరాబాద్‌లోని టోలీచౌకీలో దారుణ హత్య..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!