‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. హిట్ గ్యారంటీ.!

Republic Movie Trailer: సాయి ధరమ్ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్‌’. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో..

'అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది' రిపబ్లిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. హిట్ గ్యారంటీ.!
Republic Movie
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:15 PM

సాయి ధరమ్ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్‌’. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తేజ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్స్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా విడుదలైంది. పొలిటికల్ ఎలిమెంట్స్, మాస్‌ జనాలకు కావాల్సిన ఎలిమెంట్స్‌ను సైతం ట్రైలర్‌లో మిళితమై ఉన్నాయి. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశారు. ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’, ‘మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే.. ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు’, ‘గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ’ లాంటి దేవ్ కట్టా మార్క్‌ డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ చేరడం పక్కా అనిపిస్తోంది.

మరోవైపు సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ లభించింది. ఇక గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీని అక్టోబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. మెగా హీరోలందరూ ఈ కార్యక్రమానికి తరలి రానున్నారు.  కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్‌ కోలుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించినట్లు ప్రకటించిన సంగతి విదితమే. దీంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!