Karthikeya 2 : స్పీడు పెంచిన యంగ్ హీరో.. శరవేగంగా కార్తికేయ 2 షూటింగ్.. కీలక పాత్రలో ఆ హీరోయిన్

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్‌లో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు

Karthikeya 2 : స్పీడు పెంచిన యంగ్ హీరో.. శరవేగంగా కార్తికేయ 2 షూటింగ్.. కీలక పాత్రలో ఆ హీరోయిన్
Nikhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2021 | 3:02 PM

Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్‌లో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఈ సినిమా తోపాటుగా కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 కూడా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరనే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే అనుపమపరమేశ్వరన్‌ను హీరోయిన్ అంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విభిన్నమైన కథ కథనాలతో తెరకెక్కిన కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు అలాంటి కథ తోనే కార్తికేయ 2 కూడా తెరకెక్కనుంది. ఈ సినిమాకు కూడా చందు మొండేటినే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా షూటింగ్ చేస్తూ వచ్చారు చిత్రయూనిట్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసిందట. ఈ నెల చివరిలో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు చిత్రయూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ నిమిత్తం రెండు వారాలపాటు చిత్ర బృందం విదేశాలకు వెళ్లనున్నారట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మొదటి పార్ట్ కంటే కార్తికేయ 2 మరింత ఇంట్రెస్టింగ్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కార్తికేయలో హీరోయిన్‌గా నటించిన స్వాతి.. ఇప్పుడు కార్తికేయ 2లో కీలక పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.

Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?