AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అన్‌స్టాపబుల్.. బాలయ్యే కావాలంటున్న కుర్ర దర్శకులు.. ఏం క్రేజ్ బాబూ..?

మేం బాలయ్యను డైరెక్ట్ చేయాల్సిందే అంటున్నారు కుర్ర దర్శకులు. ఆయన కోసం స్పెషల్‌గా కథలు రెడీ చేసి.. అప్రోచ్ అవుతున్నారు.

Tollywood: అన్‌స్టాపబుల్.. బాలయ్యే కావాలంటున్న కుర్ర దర్శకులు.. ఏం క్రేజ్ బాబూ..?
Nandamuri Balakrishna
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2022 | 7:03 PM

Share

బాలకృష్ణ కోసం కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు సీనియర్లతోనే ఎక్కువగా సినిమాలు చేసిన ఈయన.. కొన్నేళ్లుగా మనసు మార్చుకున్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్స్ సైతం బాలయ్యను దృష్టిలో పెట్టుకుని కథలు అల్లుకుంటున్నారు. ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుందో అలాంటి కథల్నే సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో కుర్ర దర్శకుడు బాలయ్య లిస్టులో చేరిపోయారు. బాబు బాగా బిజీ.. బాలయ్యకు ఈ పదం ఇప్పుడు బాగా సూట్ అవుతుంది. ఖాళీ అనే మాటే లేకుండా షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు ఈయన. తాజాగా గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK 107 టర్కీ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. దీని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా రెడీగా ఉంది. బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని.. బాలయ్య కోసం చూస్తున్నారు ఈయన.

అఖండ తర్వాత బాలయ్య వర్కింగ్ స్టైల్ మారింది. ముఖ్యంగా కుర్ర దర్శకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు ఈయన. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆయన డైరెక్టర్స్ వెంట పడట్లేదు.. ఈ జనరేషన్ దర్శకులే బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. తాము కోరుకున్న వింటేజ్ బాలయ్యను స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారు. అందుకే మూడేళ్లుగా బాలయ్య కోసం వేచి చూస్తున్నారు అనిల్ రావిపూడి. నవంబర్ నుంచి అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కమర్షియల్ పంథాలో సాగే తండ్రీ కూతుళ్ల కథ ఇది. 2023 సమ్మర్‌లో NBK 108 విడుదల కానుంది.

దీని తర్వాత బాలయ్యతో బాబీ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేస్తున్నారు బాబీ. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి యంగ్ డైరెక్టర్స్‌తో నందమూరి నటసింహా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలిక. మరోవైపు అటు బుల్లితెర హోస్ట్‌గా బాలయ్య దూసుకుపోతున్నారు. ఆహాలో అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ అదిరే హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రజంట్ ఈ షో సెకండ్ సీజన్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..