AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై రియాక్షన్ ఏంటి..?.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడు..?

ప్రభాస్ ఇప్పుడు సాధారణ హీరో కాదు. దేశ విదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆయన చేసే ప్రతి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Adipurush: ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై రియాక్షన్ ఏంటి..?.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడు..?
Hero Prabhas As Lord Rama
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2022 | 7:17 PM

Share

ప్రభాస్‌ను మాస్ హీరోగా చూసాం.. బాహుబలిలో మహరాజుగా చూసాం.. కానీ ఈయన్ని దేవుడిగా మాత్రం ఎప్పుడూ చూడలేదు. కనీసం ఆ ధైర్యం కూడా ఏ దర్శకుడు చేయలేదు. కానీ తొలిసారి ఓం రౌత్ ఈ సాహసం చేయబోతున్నారు. ఆదిపురుష్‌లో అయోధ్య రాముడిగా మారిపోతున్నారు ప్రభాస్. మరి ఈ గెటప్‌లో ఆయనెలా ఉన్నారు..? రెబల్ స్టార్ రాముడి లుక్ ఎలా ఉంది..? ఓ ఇతిహాసాన్ని తెరకెక్కించడం అంటే మాటలు కాదు.. అందులోని పాత్రలకు ఎంపిక చేసుకునే నటులు కూడా కీలకమే. ఆ హిస్టారికల్ కారెక్టర్స్ సదరు నటులకు సెట్ అవ్వాలి.. లేదంటే వచ్చే విమర్శలు తట్టుకోలేరు. ఆదిపురుష్ విషయంలో అందరి అనుమానాలు ఇవే. ఇది రామాయణం అని తెలియగానే.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ లుక్ బయటికి వచ్చేసింది.

సాధారణంగా రాముడు అంటే ఇన్నాళ్లూ మనకు సినిమాల్లో క్లీన్ షేవ్‌తోనే చూపించారు. కానీ ఓం రౌత్ మాత్రం అలా కాదు. ప్రభాస్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నించారు. ఈ రామాయణంలో రాముడు మీసాలతోనే కనిపిస్తున్నారు. అక్టోబర్ 2, సాయంత్రం 7.11 నిమిషాలకు అయోధ్య సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ ఫ్లాప్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌కు కీలకంగా మారింది. ఇందులో సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్.. లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదిపురుష్‌ను 3డిలో తెరకెక్కిస్తున్నారు ఓం రౌత్. 2023, జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి రాముడిగా ప్రభాస్ చేయబోయే మాయ ఎలా ఉంటుందో చూడాలి.

వరుస సినిమాలు ఒప్పుకుని.. బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటున్న ప్రభాస్‌ను పెద్దనాన్న కృష్ణంరాజు మరణం బాగా కుంగదీసింది. ఆయన ఎంత గౌరవంగా, ప్రేమగా చూసుకునే ఇప్పుడు లేడనే విషయాన్ని ప్రభాస్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలే ఆయన్ను ఈ బాధ నుంచి దూరం చేయగలవు. ప్రభాస్‌కు మంచి మానసిక స్థైర్యం ఇవ్వాలని ఆ ప్రకృతిని కోరుకుందాం.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..