AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Ghost Releasing Trailer: ‘ది ఘోస్ట్’ న్యూ ట్రైలర్.. నాగార్జున యాక్షన్ షో.. మీరు చూశారా..?

ద ఘోస్ట్ ట్రైలర్ రిలీజయ్యింది. ఎప్పట్లానే నాగార్జున ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకున్నారు. యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి.

The Ghost Releasing Trailer: ‘ది ఘోస్ట్’ న్యూ ట్రైలర్.. నాగార్జున యాక్షన్ షో.. మీరు చూశారా..?
Akkineni Nagarjuna
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2022 | 6:55 PM

Share

పోగొట్టుకున్న చోటే.. మళ్లీ దక్కించుకోవాలని మెంటల్‌గా ఫిక్సైపోయారు నాగార్జున. ఎక్కడైతే తనకు ఫ్లాపులు వచ్చాయో.. అక్కడే మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపించాలని కత్తి పట్టుకుని యుద్ధానికి బయల్దేరారు ఈ సీనియర్ హీరో. ది ఘోస్ట్ విషయంలో నాగార్జున కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. దసరా ధమాకా ఖాయం అనిపిస్తుంది. తాజాగా మరో ట్రైలర్‌తో వచ్చారు నాగ్. మరి ఇది ఎలా ఉంది..? నాగార్జునకు సాలిడ్ బ్లాక్‌బస్టర్ వచ్చి చాలా ఏళ్ళవుతుంది. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆ స్థాయి విజయం రాలేదు. బంగార్రాజు ఓకే అనిపించిందే కానీ నాగ్ రేంజ్ హిట్టైతే కాదు. అందుకే అక్కినేని అభిమానుల ఆశలన్నీ దసరాకు రానున్న ది ఘోస్ట్‌పై ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రైలర్స్, టీజర్స్ అంచనాలు అంతకంతకూ పెంచేస్తున్నాయి.

క్లాస్ సినిమాలతో మాయ చేయడం నాగార్జునకు కొత్త కాదు. అయితే ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌తో నాగ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మూడేళ్లుగా ఇలాంటి సినిమాలతోనే దండయాత్ర చేస్తున్నారు ఈ సీనియర్ హీరో. వర్మతో చేసిన ఆఫీసర్.. కొత్త దర్శకుడు సోలోమెన్‌తో చేసిన వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. అయినా కూడా మళ్లీ ప్రవీణ్ సత్తారుతో ది ఘోస్ట్ రూపంలో యాక్షన్ సినిమాతోనే వస్తున్నారు. తాజాగా రిలీజ్ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలను హైలైట్ చేసారు.

ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు నాగ్. తనకు కొన్నేళ్లుగా కలిసిరాని జోనర్‌లోనే హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు నాగార్జున. గరుడవేగ తర్వాత ప్రవీణ్ సత్తారు చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఏకంగా 12 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయి. మరి చూడాలి.. దసరాకు గాడ్ ఫాదర్‌, ఘోస్ట్ మధ్య పోరు ఎలా ఉండబోతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
'శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే'
'శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే'
పిల్లలను కంటే రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..
పిల్లలను కంటే రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..
భారత్‌కు సూపర్ గుడ్‌ న్యూస్.. పెట్రోల్ రేట్లపై నో టెన్షన్
భారత్‌కు సూపర్ గుడ్‌ న్యూస్.. పెట్రోల్ రేట్లపై నో టెన్షన్