AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: వచ్చే ఎన్నికల్లో నాగార్జున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారా..? ఆయన సమాధానం ఇదే

అక్కినేని హీరో నాగార్జున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగబోతున్నారా..? ఈ వార్తలపై ఎట్టకేలకు నాగ్ నుంచి క్లారిటీ వచ్చింది.

Akkineni Nagarjuna: వచ్చే ఎన్నికల్లో నాగార్జున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారా..? ఆయన సమాధానం ఇదే
Nagarjuna The Ghost
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2022 | 6:47 PM

Share

మొన్న చిరంజీవి… ఇప్పుడు నాగార్జున.. టాలీవుడ్ సీనియర్ హీరోస్ పొలిటికల్‌ కామెంట్స్‌తో హీట్‌ పెంచుతున్నారు.  రాజకీయాలకు దూరం అంటూనే పొలిటికల్‌ కథలపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.  గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పొలిటికల్‌ డైలాగ్స్‌ పేల్చిన చిరు.. బ్యానర్ ఐటమ్ అయ్యారు.  ఇప్పుడు “ద ఘోస్ట్‌” ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాగార్జున పొలిటికల్‌ కామెంట్స్‌ చేశారు.  మంచి కథ వస్తే పొలిటికల్‌ లీడర్‌గా నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన ప్రచారాన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుందన్నారు. 15ఏళ్లుగా తనపై రాజకీయ కథనాలు వస్తూనే ఉన్నాయన్నారు.  ఏదో ఒక పార్టీకి లింక్‌ పెట్టి కథనాలు రాస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

నాగార్జున ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లి తెర హోస్ట్‌గా రాణిస్తున్నారు. బిగ్ బాస్‌ యాంకర్‌గా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందుకే గత కొన్ని సీజన్స్ నుంచి నాగ్‌నే కొనసాగిస్తుంది యాజమాన్యం. వయసు పెరుగున్నకొద్దీ నాగ్‌ గ్లామర్ కూడా పెరగడం గమనార్హం. ఇక స్టైలింగ్ అండ్ మెయింట్నెస్ కూడా నెక్ట్స్ లెవల్. ప్రజంట్ ట్రెండ్‌కి తగ్గట్లుగా నాగార్జున దుస్తులు ధరిస్తారు. ఆయన హెయిర్ స్టైల్‌ కూడా ట్రెండీగా ఉంటుంది. తెలియనివాళ్లు అయితే నాగచైతన్య, అఖిల్‌కు ఈయన బ్రదర్ అవుతారేమో అనుకుంటారు.

అక్కినేని నటవారసుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నాగార్జున అన్ని పాత్రల్లోనూ తన సత్తా నిరూపించుకున్నారు. అటు రొమాంటిక్ సినిమాలు చేశారు. ఇటు మాస్ సినిమాలతోనూ బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టారు. భక్తిరస చిత్రాలతోనూ మెప్పించారు.  ఫైనల్‌గా ఆల్‌రౌండర్ అనే బిరుదు దక్కించుకున్నారు. ఫిట్‌నెస్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే నాగార్జున.. డైలీ వర్కువుట్స్ చేస్తారు. ప్రజంట్ తెలుగు బిగ్ బాస్ సీజన్6 హెస్ట్‌గా ప్రతి శని, ఆదివారాల్లో బుల్లితెర ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..