Surekha Vani: అక్కాచెల్లెళ్లు అనే అనుకుంటారు.. ఏజింగ్ యంగ్.. సురేఖా వాణి అసలు వయస్సు ఎంతో తెల్సా..?
ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి యాంకర్‌గా మారింది. మాటీవీలో మా టాకీస్, హార్ట్ బీట్ ప్రొగ్రామ్స్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

ఏజింగ్ యంగ్.. అంటే వయస్సు పైబడుతున్నకొద్దీ మరింత యవ్వనంగా కన్పించడం. ఇది నేచర్ గిఫ్ట్ అనమాట. అందరికీ సాధ్యం కాదు. మన టాలీవుడ్‌లో చెప్పాలంటే ఇందుకు ఫర్‌ఫెక్ట్ ఎగ్జాంఫుల్ అక్కినేని హీరో కింగ్ నాగార్జున. ఆయనకు 63 సంవత్సరాలు అంటే మీరు నమ్ముతారా..? అస్సలు నమ్మలేం. ఫేస్‌లో అంతే గ్లో, సూపర్ ఎనర్జీ, స్టన్నింగ్ ఫిజిక్. అయితే ఫీమేల్ ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే మనం.. సురేఖా వాణి గురించి మాట్లాడుకోవాలి. ఆమె రోజురోజుకు యంగ్ అవుతున్నారు. ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో అర్థం కావడం లేదు. గతంలో హీరో హీరోయిన్స్‌కు అక్క, వదిన పాత్రలు వేసేది ఈమె. ప్రజంట్ లుక్ చూస్తే మాత్రం ఈమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయొచ్చు కదా అని మీరే అంటారు.
తెలుగు, తమిళ భాషల్లో 45 సినిమాలకు పైగా చేసింది సురేఖా వాణి. అనారోగ్యంతో భర్త మరణించడంతో.. ఆమె జీవితంలో పెద్ద కుదుపు ఎదురయ్యింది. కొన్నాళ్లు ఆ ఫేజ్‌లో ఉండిపోయిన సురేఖా వాణి.. సినిమాలను పూర్తిగా పక్కనబెట్టింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. అంతేకాదు డైట్, ఫిజిక్ విషయంలో ఆమె ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది ఆమె తాజా ఫోటోలు, వీడియోలు చూస్తుంటే. చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్. వీరిద్దరూ ఎవరో తెలియనివారికి.. వారిని పక్కపక్కన నిల్చుబెడితే పక్కాగా అక్కాచెల్లెళ్లా అని అడుగుతారు. అంతలా గ్లామర్ మెయింటైన్ చేస్తుంది సురేఖా వాణి.
అసలు ఆమె ఏజ్ ఎంతో మీకు తెల్సా..? కనీసం గెస్ చేయగలరా..? మీ ఊహకు మాత్రం అందదు. సురేఖా వాణి ప్రజంట్ ఏజ్ 42 సంవత్సరాలు. మీకు షాకింగ్‌గా అనిపించవచ్చు కానీ అదే నిజం. కాగా సురేఖా వాణి స్వస్థలం విజయవాడ. తొలుత యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తర్వాత నటిగా మారింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



