AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: త్వరలోనే స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ పెళ్లిపీటలెక్కనుందా.?

ప్రస్తుతంశ్రుతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి భారీవిజయాన్ని అందుకుంది.

Shruti Haasan: త్వరలోనే స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ పెళ్లిపీటలెక్కనుందా.?
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jan 28, 2023 | 8:09 AM

Share

టాలీవుడ్ లో ప్రస్తుతం లో లీడింగ్ లో ఉన్న బ్యూటీస్ లో అందాల భామ శ్రుతిహాసన్ ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. ప్రస్తుతంశ్రుతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి భారీవిజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతిహాసన్. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తోరూపొందుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. అలాగే తమిళ్న హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది.

ఆ మధ్య కొంతకాలం ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాతో  తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో త్వరలోనే శ్రుతిహాసన్ పెళ్లిపీటలు ఎక్కనుందని ఒక వార్త వైరల్ అవుతోంది. శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ఇదివరకే ఈమె వెల్లడించింది. అంతేకాదు.. ముందుగా తనే శాంతనుకి ప్రపోజ్ చేసినట్లు కూడా తెలిపింది. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒకటి కాబోతున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.