AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayalakshmi : యన్టీఆర్ అవార్డ్‌కు ఎంపికైన అలనాటి అందాల హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి

ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు.

Vijayalakshmi : యన్టీఆర్ అవార్డ్‌కు ఎంపికైన అలనాటి అందాల హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి
Vijayalakshmi
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2022 | 8:25 AM

Share

బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. ముఖ్యంగా అలనాడు అమె సినిమాలో చేసిన నాట్యం ఇప్పటికీ పలువురు ఆదరణ పొందుతూనే ఉంది.

ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నాట్య కళాకారులుగా ఎదిగారు. 50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలి లో జరుగుతున్న, లెజెండరీ నటుడు,యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రావడం విశేషం. తెనాలి లో జరిగే యన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రోజుకొక సినిమా చొప్పున రామారావు గారు నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మ సాని(రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శింప బడుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి ప్రతి నెల యన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు.

ప్రతి నెల యన్టీఆర్ తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్ కు అవార్డు,గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తారు.అయితే ఈ నెల యన్టీఆర్ పురస్కారానికి అలనాటి తార ఎల్. విజయ లక్ష్మి ఎంపికయ్యారు. ఈ సందర్బంగా అమెరికాలో స్థిరపడిన ఎల్. విజయ లక్ష్మి గారు ప్రత్యేకంగా ఈ అవార్డు స్వీకరించేందుకు ఇన్నేళ్ల తర్వాత అందునా తెనాలి రావడం కొస మెరుపు అయితే,ఎల్. విజయ లక్ష్మి గారు తెనాలి రావడం పట్ల ప్రేక్షకాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆ మరుసటి రోజు ఆక్కడి థియేటర్ లో జగదేకవీరుని కథ / రాముడు – భీముడు సినిమాలలో తనకు నచ్చిన ఒక సినిమాను ప్రేక్షకాభిమానులతో తో కలసి చూస్తారు..

ఇవి కూడా చదవండి