Kantara: కాంతారా సినిమాను వీక్షించిన తలైవా.. హీరో రిషబ్‌ గురించి రజనీ ఏమన్నారో తెలుసా?

ఇప్పటికే పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, ప్రభాస్‌, కంగనా రనౌత్‌ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమా సూపర్బ్‌ అంటూ తమ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్‌ చేసుకున్నారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఈ సినిమాను చూడనున్నారన్న వార్తలు వస్తున్నాయి.

Kantara: కాంతారా సినిమాను వీక్షించిన తలైవా.. హీరో రిషబ్‌ గురించి రజనీ ఏమన్నారో తెలుసా?
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2022 | 7:49 AM

కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన కాంతారా ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో సత్తాచాటుతోంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలువురు సెలబ్రిటీలు కూడా కాంతార సినిమాను చూసి అద్భుతంగా ఉందంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, ప్రభాస్‌, కంగనా రనౌత్‌ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమా సూపర్బ్‌ అంటూ తమ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్‌ చేసుకున్నారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఈ సినిమాను చూడనున్నారన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా తలైవా రజనీకాంత్‌ రిషబ్‌శెట్టి సినిమాపై ప్రశంసలు కురిపించారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా ‘తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు. కాంతార సినిమా నా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక మాస్టర్‌ పీస్‌. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్‌, చిత్రయూనిట్‌కు అభినందనలు’ అని హీరో, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌పై ప్రశంసలు కురిపించారు తలైవా.

సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన కాంతార సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక తెలుగులో అక్టోబర్ 15న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అగ్రనిర్మాత గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ ఈ సినిమా తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!