‘వింక్ బ్యూటీ’ ఎంట్రీతో..చార్మినార్ అందాలు డబులయ్యాయ్!

ప్రియా ప్రకాశ్ వారియ‌ర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. అంతేనా రకరకాల కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవాలని ఇంటిముందు క్యూ కట్టాయి. అయితే ఇంత ఫేమ్ తెచ్చిన  ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ వింక్ బ్యూటీ ఇటీవలే తెలుగులో ఓ బడా సినిమాకు సైన్ చేసింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో అమ్మడు యంగ్ హీరో నితిన్ పక్కన ఆడిపాడనుంది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:38 pm, Tue, 6 August 19
'వింక్ బ్యూటీ' ఎంట్రీతో..చార్మినార్ అందాలు డబులయ్యాయ్!

ప్రియా ప్రకాశ్ వారియ‌ర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. అంతేనా రకరకాల కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవాలని ఇంటిముందు క్యూ కట్టాయి. అయితే ఇంత ఫేమ్ తెచ్చిన  ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ వింక్ బ్యూటీ ఇటీవలే తెలుగులో ఓ బడా సినిమాకు సైన్ చేసింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో అమ్మడు యంగ్ హీరో నితిన్ పక్కన ఆడిపాడనుంది. షూటింగ్ పనుల నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన ప్రియా ఛార్మినార్‌ను సందర్శించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారాయి.