‘సాహో’కు సైడ్ ఇచ్చారు.. చాలా థ్యాంక్స్: ప్రభాస్
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం సాహో. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ఓ సైడ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరోవైపు ప్రమోషన్లు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీని మొదట ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం అవ్వడం వల్ల ఈ నెల 30కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సాహో వాయిదా పడటంతో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. […]

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం సాహో. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ఓ సైడ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరోవైపు ప్రమోషన్లు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీని మొదట ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం అవ్వడం వల్ల ఈ నెల 30కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సాహో వాయిదా పడటంతో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సాహో ఒకేసారి విడుదల కానుండగా.. ఇందుకోసం కొంతమంది తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి హీరో ప్రభాస్, నిర్మాతలు యూవీ క్రియేషన్స్ థ్యాంక్స్ చెప్పారు.
ఈ నెల 30న విడుదల కాబోతున్న సాహోకు దారి ఇచ్చేందుకు కొంతమంది తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు సినిమాలు సాహో కోసం వాయిదా పడ్డాయి. ఈ విషయంలో ఆ చిత్ర నిర్మాతలకు చాలా రుణపడి ఉన్నాం. ఎంతో గొప్ప మనసుతో వారు సాహోకు దారి ఇచ్చినందుకు కృతఙ్ఞతలు అంటూ ప్రభాస్, యూవీ క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
https://www.facebook.com/ActorPrabhas/posts/1656078427856358
కాగా భారీ యాక్షన్ ఎంటర్‌గా తెరకెక్కిన సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Extremely thankful for producers across all the languages for clearing the way for #Saaho and helping for a bigger release. Action begins in cinemas from 30th Aug!#Prabhas @ShraddhaKapoor @sujeethsign @arunvijayno1 @UV_Creations @itsBhushanKumar @TSeries #30AugWithSaaho pic.twitter.com/PGPxaone89
— UV Creations (@UV_Creations) August 6, 2019



