మన నవదీపే..నమ్ముతారా?

హీరో  నవదీప్ లాస్ట్ ఇయర్  ‘నెక్ట్స్ ఏంటి’ మూవీలో కనిపించారు. అప్పట్నుంచి పత్తా లేకుండా పోయారు. కనీసం సోషల్ మీడియాలో కూడా మూవీస్‌కి సంబంధించిన అప్డేట్స్ లేవు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీలో ఈ యంగ్ హీరో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నవదీప్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొత్త ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన కండలు తిరిగిన బాడీతో కనిపించారు. ఇప్పటి వరకు నవదీప్‌ను ఇలాంటి లుక్‌లో […]

మన నవదీపే..నమ్ముతారా?
Follow us

|

Updated on: Aug 06, 2019 | 8:17 PM

హీరో  నవదీప్ లాస్ట్ ఇయర్  ‘నెక్ట్స్ ఏంటి’ మూవీలో కనిపించారు. అప్పట్నుంచి పత్తా లేకుండా పోయారు. కనీసం సోషల్ మీడియాలో కూడా మూవీస్‌కి సంబంధించిన అప్డేట్స్ లేవు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీలో ఈ యంగ్ హీరో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే నవదీప్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొత్త ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన కండలు తిరిగిన బాడీతో కనిపించారు. ఇప్పటి వరకు నవదీప్‌ను ఇలాంటి లుక్‌లో మునుపెన్నడూ చూడలేదు. తాను ఈ విధంగా తయారవడానికి జిమ్ కోచ్ కృష్ణ సద్వాలే కారణమని నవదీప్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. ఈ విషయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, వివన్ భతేనా తనకు ఎప్పుడూ ఆదర్శం అని నవదీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా బన్నీ సినిమా కోసమే నవదీప్ ఇలా కండల వీరుడిలా తయారయ్యారని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీలో యంగ్ విలన్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి బన్నీని ఢీ కోట్టాలంటే ఆ మాత్రం బాడీ లేకుంటే ఎలా?