Varun Tej, Lavanya Tripathi: ప్రేమ చిగురించిన చోటే పెళ్లి కూడా.. వరుణ్- లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా..
ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. ఈ ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో చాలా డౌట్స్ కు క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా కేవలం కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. ఈ ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఎక్కడా కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. అడపాదడపా మీడియాలో వీరి ప్రేమ పై వార్తలు వచ్చినప్పటికీ ఒక్కరు కూడా స్పందించలేదు. ఇప్పుడు సడన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి వివాహం ఎక్కడ జరుగుతుందన్న దాని పై చర్చ జరిగుతోంది. అయితే వరుణ్ వివాహం ఇండియాలో జరగదని తెలుస్తోంది. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని అంటున్నారు.
అయితే వరుణ్ తేజ్, లావణ్య మధ్య ఎక్కడైతే ప్రేమ పుట్టిందో అక్కడే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. మిస్టర్ మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో వీరివివాహం కూడా ఇటలీలోనే చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.