Balakrishna: బాలయ్య వారసుడొస్తున్నాడు.. నందమూరి మోక్షజ్ఞ నయా లుక్.. అద్దిరిపోయిందిగా

రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పవర్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలయ్య. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

Balakrishna: బాలయ్య వారసుడొస్తున్నాడు.. నందమూరి మోక్షజ్ఞ నయా లుక్.. అద్దిరిపోయిందిగా
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2023 | 8:02 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పవర్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలయ్య. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. భగవంత్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు బాలయ్య.

ఇదిలా ఉంటే ఇప్పుడు నటసింహం వారసుడు గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా గతంలోనే మోక్షజ్ఞ డెబ్యూ గురించి మాట్లాడినా… అప్పట్లో సాధ్యం కాలేదు. బాలయ్య వారసుడు త్వరలో వెండితెర మీద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల్లో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అచ్చం హీరోలా మారారు మోక్షజ్ఞ . ఇప్పుడు అతడి లుక్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్లిమ్‌ బాడీతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు మోక్షజ్ఞ. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. Nandamuri Mokshagna