Devara: నీటి అడుగున అదిరిపోయే యాక్షన్ సీన్..? దేవరలో తారక్ సాహసం
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కసిగా ఉన్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్నారు.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. కానీ ఆయన స్పీడ్ కు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కసిగా ఉన్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొరటాల శివ తారక్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
ఇక ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర మూవీ షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురిని ఈ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతోంది.
దేవర సినిమా ను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడతాయట. అలాగే ఈ మూవీలో ఓ అండర్ వాటర్ ఫైట్ సీన్ ఉంటుందట. ఇందుకోసం సముద్రమును తలపించే ఓ పెద్ద ట్యాంకర్ ను తెప్పించి షూట్ చేస్తున్నారట. సినిమాలో ఈ యాక్షన్ సీన్ అదిరిపోతుంది అంటున్నారు, మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.