మరోసారి స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల.. ఆ స్టార్ హీరోతో స్టెప్పులేయనున్న ముద్దుగుమ్మ
పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శ్రీలీలా. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. ముఖ్యంగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమా విజయంతో శ్రీలీలాకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తన అందంతో, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారింది ముద్దుగుమ్మ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో పరిచయమైంది శ్రీలీల. సంబంధం లేకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీ లీల. అదే సమయంలో బాలీవుడ్ లోనూ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో శ్రీలీలకు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇదే క్రమంలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పుడు ఏ హీరో చూసిన శ్రీలీలే హీరోయిన్ గా కావాలి అంటున్నారు. అంతలా ఈ అమ్మడి డిమాండ్ పెరిగిపోయింది.
పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత రవితేజ ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అంతే ఆ తర్వాత ఈ చిన్నది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ కుర్రాది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది ఈ అమ్మడు. అయితే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించిన శ్రీలీల. ఇప్పుడు మరో హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తుంది.
యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య ఇటీవలే తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి ఏ ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి