- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Actress Who Famous With Villian Roles In Serials, She Is Shobha Shetty
Tollywood: ఏంట్రా బాబు ఈ అమ్మాయి.. సీరియల్లో గ్లామర్ విలన్గా.. నెట్టింట క్రేజీ హీరోయిన్గా..
ఒకే ఒక్క సీరియల్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అందమైన విలన్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ ఇప్పుడు సీరియల్స్ కు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?
Updated on: Jul 03, 2025 | 2:01 PM

ఆమె బుల్లితెరపై అందమైన విలన్. సీరియల్లో గ్లామర్ లుక్స్, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.

ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదండి.. కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి. అందంలో అప్సరస.. అయినప్పటికీ విలన్ పాత్రతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. కార్తీక దీపం తర్వాత సీరియల్స్ కు దూరంగా ఉంటున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

నెట్టింట నిత్యం ఏదోక ఫోటోషూట్ షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఎర్రని చీరకట్టు.. జడలో పూలతో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు మోనిత పాత్రలో గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు వరుసగా చీరకట్టులో ఫోటోషూట్ చేస్తుంది.

కార్తీక దీపం సీరియల్లో అద్భుతమైన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తన ఆట తీరు, ప్రవర్తనతో మరింత నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ చేయలేదు.

కానీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ వయ్యారికి ఇన్ స్టాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ క్షణాల్లో వైరలవుతున్నాయి. తాజాగా రెడ్ శారీలో మరింత పద్దతిగా కనిపిస్తూ శోభా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.




