- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Bigg Boss Season 4 Telugu Fame Monal Gajjar, What She Is Doing Now
Bigg Boss : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా టీవీలో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు త్వరలోనే సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. దీంతో రోజుకో కంటెంస్టెంట్ పేరు తెరపైకి వస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ మోనాల్ గుర్తుందా.. ?
Updated on: Jul 03, 2025 | 1:42 PM

బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉన్న షో బిగ్బాస్. ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో మంది పాల్గొని జనాలకు మరింత దగ్గరయ్యారు. సినిమా, టీవీ, సోషల్ మీడియా ఇలా నెట్టింట పాపులర్ ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొన్నారు. అందులో మోనాల్ గజ్జర్ ఒకరు.

మోనాల్ గజ్జర్.. సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ. ఒకప్పుడు ఈ అమ్మడు చాలా పాపులర్. 2012లో వచ్చిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజ్ స్టోరీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించింది.

అయితే వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా బ్రేక్ రాలేదు. కానీ బిగ్బాస్ పుణ్యమా అని ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఇందులో అందంతోపాటు తన ఆటతీరు, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక హౌస్ లో అఖిల్, అభితో ఈ అమ్మడు స్నేహం, ప్రేమాయణం గురించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఎక్కువగా గొడవలతోనే పాపులర్ అయ్యింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ అంతగా సినిమాల్లో కనిపించలేదు. కానీ గుజరాతీలో పలు సినిమాల్లో నటించింది.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న మోనాల్.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సిల్వర్ కలర్ చుడిదార్ సెట్ లో మరింత అందంగా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఈ అమ్మడు ఫోటోస్ షేర్ చేయడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.




