Godfather: గాడ్ ఫాదర్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ హీరో తిరిగి టాలీవుడ్‌లో ఆఫర్లు అందుకుంటాడా..?
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఆ సినిమా కంటే పెద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఆ సినిమా కంటే పెద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక చిరు నటన, ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొత్తంగా గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో చాలా స్పెషల్స్ ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అంతే కాదు ఈ సినిమాలో చిరు మీద ఉన్న అభిమానం తో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించాడు సల్మాన్ భాయ్. అలాగే మెగాస్టార్ కు సిస్టర్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు.
నయన్ కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సత్య దేవ్, సముద్రఖని, సునీల్, అనసూయ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించిన నటుడు ఎవరో గుర్తుపట్టారా..? ఆయన మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. చాలా కాలం క్రితం ఓ సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, నయనతారకు తండ్రిగా నటించిన నటుడి పేరు సర్వదామన్ .
కళాతపస్వి కె విశ్వనాద్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన నటుడే ఈ సర్వదామన్. ఆ సినిమాలో సుహాసిని హీరోయిన్ గా నటించగా సర్వదామన్ హీరోగా అంధుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. చాలా కాలం తర్వాత సర్వదామన్ తెలుగులో సినిమా చేయడంతో ప్రేక్షకుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో సర్వదామన్ కు తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలు సహాయక పాత్రల్లో, విలన్ పాత్రల్లో మెప్పిస్తున్నారు. అలాగే సర్వదామన్ కూడా తిరిగి తెలుగు సినిమాల్లో రాణిస్తారేమో చూడాలి.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




