Karthikeya 2: ఓటీటీలోనూ అదే దూకుడు.. రికార్డులు క్రియేట్ చేస్తోన్న కార్తికేయ2..
డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్వామిరారా తర్వాత కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అయ్యాడు.

యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నడు. కెరీర్ బిగినింగ్ లో రొటీన్ స్టోరీస్ ను ఎంచుకొని సినిమాలు చేసిన నిఖిల్ ఆ తర్వాత రూటు మర్చి స్వామిరారా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అక్కడి నుంచి డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్వామిరారా తర్వాత కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ వన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా కార్తికేయ 2 రిలీజ్ అయ్యింది.
కృష్ణుడి కంకణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా సినిమా కాకపోయినా హిట్ మాత్రం ఆరెంజ్ లో అందుకుంది. తెలుగులో సూపర్ హిట్ అవడంతో ఇతరభాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కూడా చందు మొండేటినే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
కార్తికేయ 2 సినిమా భారీ వసూళ్లను సాధించింది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో కార్తికేయ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో కూడా ఈ సినిమా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దసరా ఇకనుకగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లో ఏలాంటి రికార్డులను సృష్టించిందో ఓటీటీలో కూడా అలాంటి రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా 8 గంటల్లోనే ఏకంగా 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.తక్కువ సమయంలోనే భారీ స్ట్రీమింగ్ మినిట్స్ గా సొంతం చేసుకోవడంతో మేకర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




