ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! కల్కి సినిమాలో దీపికా ప్లేస్‌లో ఊహించని హీరోయిన్
కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. బాహుబలి సినిమా తర్వాత కల్కి ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా సాబ్ సినిమా జనవరి 9న విడుదలైంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో కల్కి 2 ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కల్కి సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె చేసిన విషయం తెలిసిందే..
అయితే స్పిరిట్ సినిమాకు కూడా దీపిక నే హీరోయిన్ అనుకున్నారు. అయితే వివిధ కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని కథానాయికగా ఎంచుకున్నారు. ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించడని వార్తలు వచ్చాయి. స్పిరిట్ తర్వాత దీపిక ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్ నుంచి కూడా ఆమెను తప్పించారు. ఈమేరకు మేకర్స్ అనౌన్స్ చేశారు.
దాంతో దీపికా ప్లేస్ లో ఎవరు నటిస్తారా అన్నది ఆసక్తి నెలకొంది. అయితే దీపీకా ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకుంటారా లేక ఆమె పాత్రను ముగిస్తారా అనే చర్చ నడుస్తుంది. కాగా దీపికా ప్లేస్ లో నటించే హీరోయిన్స్ అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు సాయి పల్లవి పేరు ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. దీపికా స్థానంలో సాయి పల్లవి అధినే న్యాయం చేస్తుందని ఆమెను ప్రభాస్ సినిమాలో ఎంపిక చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణం తోపాటు ఏక్ దిన్ అనే హిందీ సినిమాలోనూ నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




