Allu Arjun: సందీప్ ఓకే.. మరి ఆ స్టార్ డైరెక్టర్ల మాటేంటి బన్నీ
అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ధృవీకరించారు. అయితే 'స్పిరిట్', 'యానిమల్' సీక్వెల్ తర్వాతే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం బన్నీ కోసం త్రివిక్రమ్, లోకేష్ కనగరాజ్, బోయపాటి, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా బన్నీ డేట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతుండటంతో ఐకాన్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నాడు.
అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుందని కన్ఫార్మ్ చేశారు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నామని తెలిపారు. స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ ఉంటుందని.. ఆ తర్వాతే సందీప్ డైరెక్షన్లో అల్లు అర్జున్‌తో మూవీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్ సినిమా తీసుకుందుకు రెడీ అంటున్నాడు. పుష్ప3 అంటూ సుక్కు, స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎలాగూ లైన్లో నే ఉన్నాడు. వీళ్లే కాకుండా..బాలీవుడ్‌లో కూడా ఓ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కూడా బన్నీ డేట్స్ కోసం తెగ కష్టపడుతున్నారని న్యూస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
Akira Nandan: అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్
Prabhas: దటీజ్ ప్రభాస్.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
New OTT Releases: ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు..మరిన్ని ఇంట్రెస్టింగ్ OTT రిలీజ్ డీటైల్స్
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

