IND vs NZ 4th T20: వైజాగ్‌లో భారత్-కివీస్ పోరు..క్లీన్ స్వీప్‌పై సూర్య సేన కన్ను..మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలి?
IND vs NZ 4th T20: టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకున్న భారత్, 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు కన్ను క్లీన్ స్వీప్‌పై పడింది.

IND vs NZ 4th T20: టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకున్న భారత్, 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు కన్ను క్లీన్ స్వీప్‌పై పడింది. నేడు (జనవరి 28) విశాఖపట్నం వేదికగా జరగనున్న నాలుగో టీ20లో కివీస్‌ను మట్టికరిపించి 4-0తో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో వైజాగ్ క్రికెట్ అభిమానుల్లో జోష్ మామూలుగా లేదు.
టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. గత మూడు మ్యాచ్‌లలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో న్యూజిలాండ్‌ను భారత్ అధిగమించింది. అయితే, ప్రస్తుతానికి జట్టులో ఒకే ఒక్క సమస్య వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్. గత మూడు మ్యాచ్‌లలో శాంసన్‌కు అవకాశాలు దక్కినా, అతను వాటిని అందిపుచ్చుకోలేకపోయాడు. ముఖ్యంగా మూడో టీ20లో డకౌట్ అవ్వడం అతడిపై ఒత్తిడి పెంచింది. అయినప్పటికీ గంభీర్ అతనికి మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు వస్తే, శాంసన్ మిడిల్ ఆర్డర్‌లో దిగే ఛాన్స్ ఉంది.
రికార్డుల లెక్క ఇదే
భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 17 సార్లు విజయం సాధించగా, కివీస్ 10 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. గణాంకాలను బట్టి చూస్తే భారత్‌కే స్పష్టమైన ఆధిక్యం ఉంది. ముఖ్యంగా వైజాగ్‌లో మన రికార్డు చాలా బాగుంది. 2023లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఆఖరి బంతికి ఛేదించి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్ గుర్తులు అభిమానుల్లో ఇంకా తాజాగా ఉన్నాయి.
వైజాగ్ పిచ్ ఎలా ఉండబోతోంది?
విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామం. పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది, బంతి బ్యాటుకు చక్కగా వస్తుంది. ఈ మైదానంలో బౌండరీలు కూడా చిన్నవిగా ఉండటంతో సిక్సర్ల వర్షం కురవడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మంచు ప్రభావం రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు ఇబ్బందిగా మారవచ్చు. స్పిన్నర్లకు ఈ పిచ్‌పై కాస్త టర్న్ దొరికినా, బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్ నేడు (జనవరి 28) సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడుతుంది. ఈ మ్యాచ్‌ను మీరు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో చూడవచ్చు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. ఉచితంగా లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
