AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iQOO నుంచి 200MP కెమెరాతో చౌకైన ఫోన్‌.. బెస్ట్‌ ఫీచర్స్‌.. లాంచ్‌ ఎప్పుడంటే..!

iQOO 15R India Launch Date: iQOO త్వరలో భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ 200MP ప్రైమరీ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ప్రకటించింది కంపెనీ. దీని వివరాల గురించి మరింత తెలుసుకుందాం.

iQOO నుంచి 200MP కెమెరాతో చౌకైన ఫోన్‌.. బెస్ట్‌ ఫీచర్స్‌.. లాంచ్‌ ఎప్పుడంటే..!
Iqoo 15r
Subhash Goud
|

Updated on: Jan 28, 2026 | 10:23 AM

Share

iQOO 15R త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో, సరసమైన ధరతో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 24న లాంచ్ కానుంది. అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ AMOLED డిస్‌ప్లే, 7600mAh బ్యాటరీతో వస్తుంది. ఇది హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కోరుకునే వినియోగదారులను ఈ ఫోన్ లక్ష్యంగా చేసుకుంటుంది.

స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయి?

iQOO 15R అనేది చైనాలో లాంచ్ చేసిన iQOO Z11 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. కనీసం డిజైన్ అదే సూచిస్తుంది. దీనిని చైనాలో లాంచ్ చేసిన ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా పరిగణిస్తే, దాని ఫీచర్లను కూడా ఊహించడం సులభం. ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని ప్రాథమిక కెమెరా 200MP సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడి ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందని భావిస్తున్నారు.

Pension Scheme: కేవలం రూ.210 డిపాజిట్‌తో ప్రతి నెలా రూ.5000 పెన్షన్.. అద్భుతమైన స్కీమ్!

ధర ఎంత ఉంటుంది?

ఈ ఫోన్ 7600mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ 100W వైర్డ్ ఛార్జర్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది. ఈ ఫోన్ చైనాలో 2699 యువాన్ల (సుమారు రూ. 36,000) ధరకు లాంచ్ చేసింది కంపెనీ. ఈ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 8GB RAM+ 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుంది. భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర ఇంకా తెలియదు.

Electric Cars: ఈ 3 కార్లు రూ. 10 లక్షలలోపే.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 365 కిలోమీర్లు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి