గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి.. ఆ బిగెస్ట్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
సాయి పల్లవిని ఇష్టపడని ప్రేక్షకులు ఉంటారా.? ఉండరనే చెప్పాలి.. ఈ ముద్దుగుమ్మను ఈ తరం సౌందర్య అని ఎంతో మంది పిలుచుకుంటున్నారు. ఎక్కడా స్కిన్ షో చేయకుండా కేవలం తన నటనతో ఎంతో ,మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు

సాయి పల్లవి.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఈ ముద్దుగుమ్మ. చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రామాయణం సినిమాలో సీతగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు.
ప్రస్తుతం సాయి పల్లవి స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంది. తమిళ్ లో అమరన్, తెలుగులో తండేల్ సినిమాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే హిందీలో రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది సాయి పల్లవి. అలాగే ఇటీవలే మరో బాలీవుడ్ మూవీ ఏక్ ధిన్ అనే సినిమాను అనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవికి మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
ప్రస్తుతం రజినీకాంత్ 173 సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను కమలహాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ సినిమాకు శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. గతంలో కమల్ హాసన్ నిర్మించిన అమరన్ సినిమాలో సాయి పల్లవి నటించింది. దాంతో ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలో సాయి పల్లవి ఛాన్స్ దక్కించుకుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Rajinikanth
సాయి పల్లవి ఇన్ స్టా…
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




